ఎందుకిలా..?

ABN , First Publish Date - 2021-11-10T05:20:03+05:30 IST

ఏం జరిగిందో జరిగిందో తెలియదు. ఆదివారం కొడుకు ఆత్మహత్య చేసుకోగా, మంగళవారం ఓ మహిళ తన తల్లితో కలిసి ఉరి వేసుకుని చనిపోయారు.

ఎందుకిలా..?

మొన్న కొడుకు.. ఇప్పుడు తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
భీమవరం క్రైం, నవంబరు 9 : ఏం జరిగిందో జరిగిందో తెలియదు. ఆదివారం కొడుకు ఆత్మహత్య చేసుకోగా, మంగళవారం ఓ మహిళ తన తల్లితో కలిసి ఉరి వేసుకుని చనిపోయారు. వీరు ముగ్గురూ ఎందుకు ఇలా చేశారోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం టూ టౌన్‌ ఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాలివి.. దిర్సుమర్రు వారి వీధిలో వేములమంద ఇందిర ప్రియ(58) తన తల్లి గొట్టుముక్కల రాధాకృష్ణకుమారి(75) కుమారుడు యోగీశ్వర వెంకటకార్తీక్‌తో ఉంటున్నారు. ఏమైందో తెలియదు. ఈ నెల 7వ తేదీ రాత్రి కార్తీక్‌ విజయవాడలోని ఓ లాడ్జీలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమాచారాన్ని అక్కడి పోలీసులు మృతుడి ఫోన్‌ ద్వారా 8న తల్లి ఇందిరా ప్రియకు సమాచారం ఇచ్చారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఇందిరా ప్రియ, ఆమె తల్లి రాధాకృష్ణకుమారి మంగళవారం రాత్రి తమ ఇంట్లో వేర్వేరు ప్యాన్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అసలు ఏం జరిగింది అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-11-10T05:20:03+05:30 IST