నగర పంచాయతీలో పుసుపు జెండా ఎగరేస్తాం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-11-01T04:41:26+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కెళ్లిపోయిందని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

నగర పంచాయతీలో పుసుపు జెండా ఎగరేస్తాం : ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిన యువకులు

ఆకివీడు, అక్టోబరు 31 : వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కెళ్లిపోయిందని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. స్థానిక 12వ వార్డులో దూబ సురేష్‌ నేతృత్వంలో పార్టీలో చేరిన సుమారు 50 మంది యువతకు ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వా నించారు. టీడీపీ ప్రభుత్వంలో అర్హులకు సెంటున్నర స్థలమిస్తే వైసీపీ ప్రభు త్వం దానిని రద్దు చేసి సెంటు భూమి ఇచ్చిందన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయానికి వైసీపీ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. నగర పంచాయతీలో తొలిసారి పసుపు జెండానే ఎగురుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మోటుపల్లి రామవర ప్రసాద్‌, బొల్లా వెంకట్రావు, నౌకట్ల రామారావు, గంధం ఉమా,ఎండీ అజ్మల్‌, మాజీ సర్పంచ్‌ గొంట్లా గణపతి, గుడిగంట వెంకటేశ్వరరావు, పిన్నమరాజు శ్రీనివాసరాజు, కట్టా నాగ పాల్గొన్నారు.


పింఛన్లు వచ్చేలా చూడండి... 


పింఛన్లురద్దుచేశారంటూ ఎమ్మెల్యే మంతెన రామరాజు దగ్గర ఆదివారం వృద్ధ మహిళలు మొరపెట్టుకున్నారు. ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ బతుకుతున్న తమకు పింఛన్లు తొలగించడంమేమిటని వేడుకున్నారు. ఎమ్మెల్యే రామరాజు పింఛన్లు నిలిపివేసిన వారి పేర్లు రాసుకున్నారు. సంబంధిత అధి కారులతో మాట్లాడి అర్హులకు పింఛన్లు వచ్చేలా చూస్తానన్నారు.  


Updated Date - 2021-11-01T04:41:26+05:30 IST