పాఠశాలలో ఇదేం భోజనం..!
ABN , First Publish Date - 2021-02-26T04:28:53+05:30 IST
మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ఎమ్మెల్యే అసంతృప్తి
ఉండి, ఫిబ్రవరి 25: మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో భోజ నం ఆయన రుచి చూసి ఇదేం భోజనం అంటూ మండిపడ్డారు. ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల, ఆరేడు మండల పరిషత్ ప్రాఽథమిక పాఠశాలను గురు వారం ఆయన పరిశీలించారు. ఏక్తాశక్తి సంస్థ అందిస్తున్న భోజనంపై తరచు ఫిర్యాదులు అందడంతో ఆయన విద్యార్థులను ఆరా తీశారు. కేవలం 15 శాతమే భోజనం తీసుకుంటున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. కిచిడి, టమోట చట్ని, కోడిగుడ్డు రుచి చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆరేడు పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఎంఈవో రవీంద్ర, కాగిత బుజ్జి, ముదునూరి కృష్ణంరాజు, ఆరేడు బాబి తదితరులు పాల్గొన్నారు.