50 ఆక్సిజన్‌ బెడ్‌లు పెంచుతాం

ABN , First Publish Date - 2021-05-19T04:49:46+05:30 IST

కరోనా విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సూచించారు.

50 ఆక్సిజన్‌ బెడ్‌లు పెంచుతాం

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌

భీమవరం, మే 18 : కరోనా విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సూచించారు. కరోనా విధుల్లో ఉన్నవారితో మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందన్నారు.చివరి సమయంలో ఆక్సిజన్‌ అం దకపోవడంతో ఆక్సిజన్‌ బెడ్‌ల కోసం వస్తున్నారన్నారు. పట్టణ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు 250 బెడ్‌ల వరకు ఏర్పాటు చేశామన్నారు. ఆక్సి జన్‌ బెడ్‌పై కరోనా బాధితులు కనీసం పదిరోజులైనా చికిత్స చేయించుకోవాల్సి ఉందన్నారు. అందుకే నేడు పట్టణంలో బెడ్‌ల కొరత ఏర్పడిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే పట్టణంలో మరో 50 బెడ్‌లు వరకు పెంచాలని ఆలోచన చేసి సొంతంగా కొన్ని, దాతలు కొన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-05-19T04:49:46+05:30 IST