అన్ని ప్రాజెక్టులు కేంద్రం పరిధిలో ఉంటే సమస్య : నిమ్మల
ABN , First Publish Date - 2021-07-25T05:04:39+05:30 IST
రాష్ట్రాల మధ్య నదీ జలాల ప్రాజెక్టుల వివాదాలు ఉన్న శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు మాత్రమే కేంద్ర జల సంఘం పరిధిలో ఉండా లని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామా నాయుడు అన్నారు.

పాలకొల్లు/అర్బన్, జూలై 24 : రాష్ట్రాల మధ్య నదీ జలాల ప్రాజెక్టుల వివాదాలు ఉన్న శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు మాత్రమే కేంద్ర జల సంఘం పరిధిలో ఉండా లని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామా నాయుడు అన్నారు. స్థానిక లాకుల సెంటర్‌లో సర్ ఆర్ధర్ కాటన్ 97వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అన్ని ప్రాజె క్టులు కేంద్ర జల సంఘం పరిధిలో ఉండడం వల్ల భవిష్యత్‌లో ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. రైల్వే గేటు సెంటర్‌లోని అందే నాని తేజా ప్లాజా వద్ద ఉన్న కాటన్ విగ్రహానికి సీఐ ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్య క్ర మంలో రైతులు అడ్డాల వాసు, ఉంగరాల లక్ష్మీ నరసింహారావు, లక్ష్మీనారాయణ, ప్రకాశరావు, విజయభాస్కర్, ఆర్కిటెక్ట్ అందే జైపాల్ నాయుడు, పాల్గొన్నారు.