మహిళను అవమానించిన మంత్రులకు మరింత భద్రతా ?
ABN , First Publish Date - 2021-11-26T05:32:15+05:30 IST
నాడు కౌరవసభలో మహిళకు అవ మానం జరిగితే నేడు జగన్ సభలో జరిగిందని, శాసనసభలో మహిళను అవమానపర్చిన మంత్రులకు ప్రభుత్వ డబ్బుతో అదనపు భద్రతను పెంచ డం రౌడీల రాజ్యానికి నిదర్శనమని పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

ఆడపడుచుల ఆత్మగౌరవ సభలో ఎమ్మెల్యే నిమ్మల విమర్శ
పాలకొల్లు రూరల్, నవంబరు 25 : నాడు కౌరవసభలో మహిళకు అవ మానం జరిగితే నేడు జగన్ సభలో జరిగిందని, శాసనసభలో మహిళను అవమానపర్చిన మంత్రులకు ప్రభుత్వ డబ్బుతో అదనపు భద్రతను పెంచ డం రౌడీల రాజ్యానికి నిదర్శనమని పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు విమర్శించారు. దగ్గులూరులో గురువారం జరిగిన ఆడపడుచుల ఆత్మగౌరవ సభకు ఆయనతోపాటు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, టీడీపీ నాయకులు సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా లోకానికి జరిగిన అవమానంతో ఆడవాళ్లే కాదు మగవాళ్లు కూడా రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నా రని విమర్శించారు. రాష్ట్రంలో మహిళకు జరిగిన అవమానంపై మహిళలంతా ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నా ఇప్పటికీ కొడాలి నాని, చంద్రశేఖర్‌రెడ్డి, వల్లభ నేని వంశీ, అంబటి రాంబాబులకు పశ్చాత్తాపం లేదన్నారు. ఎమ్మెల్సీ అంగర మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇటువంటి నీచచర్యలకు దిగజారుతున్నారని విమర్శించారు. సభలో ఎమ్మెల్యే నిమ్మల సతీమణి సూర్య కుమారి, ఎమ్మెల్సీ రామ్మోహన్ సతీమణి కృష్ణవేణి, ఎంపీటీసీ సభ్యుడు సాగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.