రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజు

ABN , First Publish Date - 2021-07-09T00:07:26+05:30 IST

రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజు

రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజు

పోలవరం: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరు, కొయ్యలగూడెం మండలం సీతంపేటలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల సమస్యలన్నీ పరిష్కరించబడతాయన్నారు. నాణ్యత గల విత్తనాలు, ఎరువులు, రైతులకు అవసరమైనవన్నీ ఈ కేంద్రాల్లో లభిస్తాయన్నారు. రైతులకు పెద్ద పీట వేసిన ఘనత వైఎస్సార్‌దేనని, ఉచిత కరెంట్, రైతులకు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ కుమారుడైన సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేసి రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని బాలరాజు పేర్కొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బాలరాజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T00:07:26+05:30 IST