మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి
ABN , First Publish Date - 2021-10-30T04:55:12+05:30 IST
అర్థవరం గ్రామంలో విద్యా, వైద్యం, సంక్షేమ పథకాల అమలును శుక్రవారం ఎంపీడీఓ జ్యోతిర్మయి పరిశీలించారు.
గణపవరం, అక్టోబరు 29: అర్థవరం గ్రామంలో విద్యా, వైద్యం, సంక్షేమ పథకాల అమలును శుక్రవారం ఎంపీడీఓ జ్యోతిర్మయి పరిశీలించారు. గ్రామ సచివాలయం ద్వారా సేవలు ఏ మేరకు అందుతున్నాయో ఇంటింటా పర్యటించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే తన దృష్టికి తేవాలని ప్రజలను కోరారు. స్థానిక హైస్కూల్‌లోని విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూసి మరింత నాణ్యతగా ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. మంచినీటి సౌకర్యం, ఆర్వో ప్లాంటుకు మరమ్మతులు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. సర్పంచ్ గాతల సుజాత, దత్తడి సుభాష్, వీఆర్వో శ్రీకాంత్, గ్రామ కార్య దర్శి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.