కొండరెడ్డి పాఠశాల మెరుగుపరచండి

ABN , First Publish Date - 2021-10-26T04:56:17+05:30 IST

మండలంలోని లంకపాకలలో గిరిజన సం క్షేమ ఆశ్రమ కొండరెడ్డి పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి.

కొండరెడ్డి పాఠశాల మెరుగుపరచండి
వినతిపత్రం ఇస్తున్న సర్పంచ్‌ కారం లక్ష్మి

బుట్టాయగూడెం, అక్టో బరు 25: మండలంలోని లంకపాకలలో గిరిజన సం క్షేమ ఆశ్రమ కొండరెడ్డి పాఠశాలలో  సమస్యలు తిష్ట వేశాయి. పాఠశాలను మెరుగుపరచాలని అలి వేరు సర్పంచ్‌ కారం లక్ష్మి ఐటీడీఏ పీవో ఆనంద్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో కూడా పాఠశాలకు ఎటువంటి సౌకర్యాలు అందలేదని తెలిపారు. గతంలో ఆశ్రమ పాఠశాలను మూసివేయగా కొండరెడ్ల ఆందోళన తో 2019 ఆగస్టులో పునఃప్రారంభించారన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 1 నుంచి 8 వరకు 114 మంది విద్యార్థులు చదువుచున్నారని వారికి ప్రభుత్వం అందిస్తున్న ఏఒక్క పథకం అందడం లేదన్నారు. పాఠశాల గుర్తింపునకు అవసరమైన డీడీవో కోడ్‌ ఇప్పించకపోవడంతో పాఠశాలకు నేటికి గుర్తింపు లేదని, వెంటనే డీడీవో కోడ్‌ను ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:56:17+05:30 IST