సేవల్లో..చిరు అభిమానులు ఆదర్శంగా నిలవాలి

ABN , First Publish Date - 2021-08-10T05:36:44+05:30 IST

చిరంజీవి అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని పలువురుకి ఆదర్శంగా నిలవాలని సూర్యమిత్ర అధినేత డాక్టర్‌ ఇర్రింకి సూర్యారావు పిలుపు నిచ్చారు.

సేవల్లో..చిరు అభిమానులు ఆదర్శంగా నిలవాలి
భీమవరంలో మొక్కలు నాటుతున్న నాయకులు

భీమవరం టౌన్‌, ఆగస్టు 9 : చిరంజీవి అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని పలువురుకి ఆదర్శంగా నిలవాలని సూర్యమిత్ర అధినేత డాక్టర్‌ ఇర్రింకి సూర్యారావు పిలుపు నిచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను పుస్కరించుకుని చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో పీఎస్‌ఎం బాలికల ఉన్నత పాఠశాలల్లో సోమవారం మొక్కలు నాటారు. చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉండపల్లి రమేష్‌ నాయుడు మాట్లాడుతూ చిరజీవి పుట్టిన రోజు వేడుకలు ఈనెల 22 వరకు నిర్వహిస్తామని 20న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. కార్యర్రమంలో చల్లా రాము,  హెచ్‌ఎం భోగేశ్వరరావు, యర్రంశెట్టి శ్రీనివాస్‌, రావూరి ప్రబాకర్‌, రిట్టా వెంకన్న, అల్లు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

నరసాపురం రూరల్‌, ఆగస్టు 9: ప్రతి అభిమాని తొమ్మిది మొక్కలు నాటి సంరక్షించాలని జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ బొమ్మిడి నాయకర్‌ అన్నారు. చిట్టవరంలో చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం మొక్కలు నాటారు. చిరంజీవి యువత జిల్లా ఆధ్యక్షుడు కోపల్లి శ్రీనివాస్‌, ఆకన చంద్ర శేఖర్‌, బాబి, పైడికొండల కృష్ణ, కర్రా శ్రీను, పోలిశెట్టి సత్తిబాబు, చెన్నంశెట్టి నాగు, హరి, రాజ్‌కుమార్‌ ఉన్నారు. 

ఆచంట, ఆగస్టు 9: చిరంజీవి జన్మదిన పురస్కరిం చుకుని ఈనెల 15 వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభిమానులు మొక్కలు నాటాలని చిరంజీవి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్‌ కోరారు. అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి జిల్లా యువత అధ్యక్షుడు వరికూడి సాయి కిషోర్‌, షేక్‌ మహ్మద్‌ ఆలీ, జవ్వాది బాలాజీ, జెట్టి వినోద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-10T05:36:44+05:30 IST