సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-29T05:02:14+05:30 IST

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ రవికుమార్‌ అన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వైద్య శిబిరంలో మాట్లాడుతున్న సీఐ

నల్లజర్ల, అక్టోబరు 28: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ రవికుమార్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పీఎంపీ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో సుభద్రపాలెంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్‌ రాజశేఖర్‌, చిన్నికుమార్‌, లీలారాణి వైద్య సేవలందించారు. సీఐ మాట్లాడుతూ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐ అవినాష్‌, పీఎంపీ అసోషియేషన్‌ అధ్యక్షుడు బోడిగడ్ల సీతారాములు, నల్లజర్ల మురళి, కార్యదర్శి ధనంజయరావు, సర్పంచ్‌ చవ్వాకుల వెంకటలక్ష్మి, ఎంపీటీసీ బిరుదుగడ్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:02:14+05:30 IST