అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-11-03T04:47:32+05:30 IST

అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మండల పరిషత్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎలీజా

చింతలపూడి, నవంబరు 2: అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో సమీక్షించాలన్నారు. తిమ్మిరెడ్డిపల్లి సర్పంచ్‌ గంగవల్లి శ్యామ్‌శేఖర్‌ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో సలహా మండళ్లు ఉన్నా యా అని ప్రశ్నించారు. సరైన రికార్డులు కూడా లేవని, విత్తన కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకునే  సమయంలో ఒప్పంద పత్రాలను ఆర్బీకే కేంద్రాల్లో నమోదు చేయాలన్నారు. నాడు నేడు పథకంలో పాఠశాలల్లో ఏర్పాటు చేయాల్సిన ఆర్వో  వాటర్‌ ప్లాంట్‌లు ఎక్కడా లేవన్నారు. ఆర్‌బీకే కేంద్రాల్లో పర్యవేక్షణ కొరవడిందన్నారు. ఎంపీపీ రాంబాబు మాట్లాడుతూ మండలంలో 9 ఎయిడెడ్‌ స్కూల్స్‌ ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటుకు తీర్మానిస్తామన్నారు.  జడ్పీటీసీ నీరజ, ఎంపీడీవో రాజ్‌మనోజ్‌, తహసీల్దార్‌ ప్రమద్వొర, వ్యవసాయ శాఖ ఏడీ పిజి బుజ్జిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T04:47:32+05:30 IST