ఓం మహాకాళ్యై నమః

ABN , First Publish Date - 2021-10-15T05:15:53+05:30 IST

దువ్వలో దానేశ్వరి అమ్మవారు గురువారం మహిషా సురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఓం మహాకాళ్యై నమః
తాళ్లపూడిలో మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ...

తణుకు, అక్టోబరు 14: దువ్వలో దానేశ్వరి అమ్మవారు గురువారం మహిషా సురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సజ్జాపురంలోని శ్రీసోమేశ్వ ర స్వామి ఆలయంలో చండీహోమం నిర్వహించారు. 

పెంటపాడు: ప్రత్తిపాడు వై.జంక్షన్‌ వద్ద గురువారం కనకదుర్గమ్మ అమ్మ వారు మహిషాశురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు కొత్తలంక శివసత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. రూరల్‌ సీఐ రవికుమార్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.

అత్తిలి: అత్తిలిలో శ్రీ విజయచాముండేశ్వరి అమ్మవారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన కందుల శ్రీ రామ్‌కుమార్‌ దంపతులచే చండీహోమం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. 

నిడదవోలు: తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ అమ్మవారికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. మరో పక్క పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయం కళకళలాడింది. 336 మంది దంపతులు కుంకుమ పూజ లలో పాల్గొన్నారు. గురువారం ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన విజయ దుర్గ స్వీట్‌ షాపు నిర్వాహకులు 52 కేజీల బూంది లడ్డూను అమ్మవారికి సమర్పించారు. కోట సత్తెమ్మ ఆలయంలోని నిత్యాన్నదాన ట్రస్ట్‌కు నిడదవోలు పట్టణానికి చెందిన కలగ శ్రీనివాస్‌ రూ.25,000 అందజేశారు. నిడదవోలు గ్రామ దేవత నాంగల్యదేవి (నంగాలమ్మ) అమ్మవారి ఆలయంలో నవరాత్రి పూజలలో భాగంగా గురువారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పూరి గుడి వద్ద భవాని మాలదారులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పూరిగుడివద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ఊయల సేవ పలువురిని ఆకర్షించింది.

 తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం 17 వార్డులో విశ్వదుర్గేశ్వరీ మాతను హరిత దేవిగా అలంకరించారు. 108 కళాశాల గోదావరి జలాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌ పర్యవేఽక్షించారు. 

కొవ్వూరు: కొవ్వూరు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారిని శాకాంబరీ మాతగా, కుమారదేవంలో గండి పోచమ్మ ఆలయం, సంస్కృత పాఠశాల ప్రాంగణంలో వున్న లలితా పార్వతీ సమేత గోష్పాదేశ్వరస్వామి ఆలయం, కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో వున్న బాలాత్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామి ఆలయం, కొవ్వూరమ్మ ఆలయం, రెల్లిపేట నూకాలమ్మ ఆలయం, మున్సిపల్‌ కార్యాలయం వద్ద కనకదుర్గమ్మ ఆలయాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.

ఉంగుటూరు:మండలంలో దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం ఉంగుటూరు గ్రామ దేవత చల్లాలమ్మను మహాగౌరిగా అలంకరించి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు.

తాళ్లపూడి: కనక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని మహిషాసుర మర్దినిగా గురువారం అలంకరించి ఆలయ నిర్వాహకుడు నీలి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు

గణపవరం: గణపవరం కన్యాక పరమేశ్వరి అమ్మవారికి ఆర్యవైశ్య జిల్లా ఉపాఽధ్యక్షుడు చేగు సుబ్రహ్మణ్యం దంపతులు, గణపవరం చినరామచంద్రపు రంలో కనకదుర్గమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కాకర్ల విష్ణు శ్రీనివా సరావు దంపతుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. గణపవరం బాలయ్య చెరు వు వద్ద కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవార్లకు సరస్వతి దేవీ అలంకరణలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ తెలగారెడ్డి బాబీ దంపతులు పూజలు నిర్వహించారు. 

భీమడోలు: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని భీమడోలు, గుండు గొలను, పూళ్ళ, కురెళ్ళగూడెం, పోలసానపల్లి తదితర గ్రామాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు సహస్ర దీపాలంకరణ పూజలు నిర్వహి ంచారు.  గుండుగొలను భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని కాళికాదేవిగా అలంకరి ంచి లక్ష కుంకుమార్చన పూజలు చేశారు. 

నిడమర్రు: మందలపర్రు ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఉమాదేవి అమ్మవారిని మహిషా సుర మర్దినిగా అలంకరణ ఆక ట్టుకుంది. పెదనిండ్రకొలను వెల మపేటలో రూ. 88 లక్షలతో ధన లక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మందలపర్రు, భువనపల్లి, అడవికొలను, సిద్ధా పురం, పెదనిండ్రకొలను గ్రామా ల్లో అమ్మవార్ల ఆలయాలన్నీ భవానీలతో, భక్తులతో కిటకిట లాడాయి. 
Updated Date - 2021-10-15T05:15:53+05:30 IST