డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీలో చేర్చాలి
ABN , First Publish Date - 2021-10-29T04:50:23+05:30 IST
డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీలో చేర్చాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలను తగ్గించాలని తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ధర్నా నిర్వహించింది.

లారీ యజమానుల సంఘం డిమాండ్
తాడేపల్లిగూడెం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీలో చేర్చాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలను తగ్గించాలని తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ధర్నా నిర్వహించింది. స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద నిరసన చేపట్టిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు. అసోసి యేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురుజు సూరిబాబు మాట్లాడుతూ డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్నులు కలిపి లీటరుపై 32 శాతం, రాష్ట్రం రోడ్డు పన్నుతో కలిపి వ్యాట్ 22 శాతం అమలు చేస్తోందన్నారు. మరో నాలుగు రూపా యలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు. డీజిల్‌లోనే రోడ్డు పన్నులు వసూలు చేసి మళ్లీ టోల్ టాక్స్‌లు ఎందుకని ప్రశ్నించారు. తాడేపల్లి గూడెం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అధ్యక్షుడు జానకిరాము మాట్లాడుతూ మూడో పార్టీ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం పది రెట్లు పెంచడం వల్ల రవాణా రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. ధర్నాలో లారీ యజమానులు, వర్కర్లు పాల్గొన్నారు.