విద్యుదాఘాతానికి లారీ డ్రైవర్‌ బలి

ABN , First Publish Date - 2021-05-18T05:59:15+05:30 IST

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మెకానిక్‌ మృతి చెందినట్టు పాలకొల్లు రూరల్‌ పోలీసు లు తెలిపారు.

విద్యుదాఘాతానికి లారీ డ్రైవర్‌ బలి

పాలకొల్లు రూరల్‌, మే 17: విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మెకానిక్‌ మృతి చెందినట్టు పాలకొల్లు రూరల్‌ పోలీసు లు తెలిపారు. యలమంచిలి మండలం ఇలపకుర్రుకు చెందిన సిర్రా చంద్రశేఖర్‌ బాబు (27) మెకానిక్‌ కాగా  లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను నడుపుతున్న లారీ ట్రక్కును  కిరాయికి లంకలకోడేరు పెదపేటకు తీసుకువెళ్ళాడు. అక్కడ హైడ్రాలిక్‌ పనిచేయక పోవడంతో దానిని పైకిలేపి మరమ్మతులు చేస్తుండగా పైన ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే చంద్రశేఖర్‌ బాబు మరణించాడని ఎస్‌ఐ పి. అప్పారావు తెలిపారు. మృతుని సోదరుడి  ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-18T05:59:15+05:30 IST