లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం అభినందనీయం

ABN , First Publish Date - 2021-05-19T05:17:28+05:30 IST

ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడం అభినందనీయం అని ఎస్పీ నారాయణ నాయక్‌ అన్నారు.

లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం అభినందనీయం
తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్పీ నారాయణ నాయక్‌

ఎస్పీ నారాయణ నాయక్‌ 

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 18:  ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడం అభినందనీయం అని ఎస్పీ నారాయణ నాయక్‌ అన్నారు. తాడేపల్లిగూడెంలో లాక్‌డౌన్‌ నియమాలు ఎలా నిర్వహిస్తున్నారనే అంశాలపై మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తణుకు, భీమవరం రోడ్డులతోపాటు, నల్లజర్ల రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించి పోలీసుల పనితీరును అభినందించారు. ఇదే మాదిరిగా ప్రజలు సహకారం అందిస్తే కరోనాను తరిమికొట్టవచ్చన్నారు. కార్యక్రమంలో సీఐలు ఆకుల రఘు, వీరా రవికుమార్‌, ఎస్‌ఐలు రమేశ్‌, బి.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-19T05:17:28+05:30 IST