జిల్లా లయన్స్ గవర్నర్ల ఎంపిక
ABN , First Publish Date - 2021-05-05T06:21:06+05:30 IST
జిల్లా లయన్స్ 316జి 2021–22 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఏలూరు కల్చరల్, మే 4: జిల్లా లయన్స్ 316జి 2021–22 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోవిడ్ కారణంగా మంగళవారం వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించినట్టు లయన్స్ క్లబ్ చీఫ్ ఎడిటర్ వి. వెంకట స్వామి తెలిపారు. తణుకు లయన్స్ క్లబ్ నుంచి టి. రంగారావు, ఏలూరు దుర్గా తేజ లయన్స్ క్లబ్ నుంచి డాక్టర్ పంకజాక్షన్‌ను ఫస్టు డిస్ర్టిక్ట్ గవర్నర్లుగా, తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ నుంచి గట్టెం మాణిక్యాలరావును సెకండ్ వెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు. వెంకటస్వామి తదితరులు క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.