భాషా వలంటీర్ల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-11-29T04:52:37+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కోయ భాషా వలంటీర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్య క్షుడు తెల్లం రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

భాషా వలంటీర్ల సమస్యలు పరిష్కరించండి
భాషా వలంటీర్ల సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ

బుట్టాయగూడెం, నవంబరు 28: రాష్ట్రవ్యాప్తంగా కోయ భాషా వలంటీర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివాసీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన భాషా వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ మండలాల్లో 101 మంది కోయ భాషా వలంటీర్లుగా గత ఏడాది విద్యాబోధన చేశారని, వారికి మూడు నెలల వేతన బకాయి చెల్లించాల్సి ఉం దన్నారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని కోరారు. 2019లో కోయ భారతి పుస్తకాలను ముంద్రించారని, ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా పుస్తకాలు ముద్రించకపోవడం బాధాకరమన్నారు. భాషా వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని డిసెంబరు 1న విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ధర్ముల రమేష్‌, ఉపాధ్య క్షుడు పోలోజు నాగేశ్వరావు, సీఐటీయూ మండల కార్యదర్శి మొడియం నాగమణి, భాషా వలంటీర్లు పూనెం సత్తిరాజు, పృధ్వీరాజు, నవీన్‌, సీతా మహాలక్ష్మి, బేబి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T04:52:37+05:30 IST