‘భారతీయ సంస్కృతికి మూలం వేదాలు’

ABN , First Publish Date - 2021-11-14T05:12:57+05:30 IST

భారతీయ సంస్కృతికి మూలం వేదాలు అని విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజి అన్నారు.

‘భారతీయ సంస్కృతికి మూలం వేదాలు’
కార్యక్రమంలో మాట్లాడుతున్న స్వామీజి

కాళ్ల, నవంబరు 13 : భారతీయ సంస్కృతికి మూలం వేదాలు అని విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజి అన్నారు. కార్తీకమాసం పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏలూరుపాడులో శనివారం ఆయన      పర్యటించారు. తొలుత గ్రామ శివాలయంలో పూజలు చేశారు. అనంతరం పొదిలి నారాయణమూర్తి గృహం వద్ద చేపట్టిన లక్షవర్తి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాలను పరిరక్షించాలంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలపై భక్తిశ్రద్ధలు అవసరమన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు వేదం, పురాణాలకు అత్యంత ప్రాధాన్యత కూడిన ప్రదేశాలుగా అభివర్ణించబడ్డాయన్నారు. అనంతరం భక్తులకు ప్రవచనాలు వల్లించి ఆశీర్వచనాలు అందించారు. తొలుత స్వామీజీకి గ్రామ సర్పంచ్‌ భూపతిరాజు జగ్గరాజు, వైసీపీ నేత మంతెన రవివర్మతో పాటు పలువురు పెద్దలు స్వాగతం పలికారు. 

Updated Date - 2021-11-14T05:12:57+05:30 IST