మునిసిపల్‌ సమావేశానికి కౌన్సిలర్లు గైర్హాజరు

ABN , First Publish Date - 2021-07-25T04:55:17+05:30 IST

కొవ్వూరు మున్సిపల్‌ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది.

మునిసిపల్‌ సమావేశానికి కౌన్సిలర్లు గైర్హాజరు
టీడీపీ, బీజేపీ కౌన్సిలర్లు మాత్రమే ఉన్న కౌన్సిల్‌

కొవ్వూరు, జూలై 24: కొవ్వూరు మున్సిపల్‌ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన శనివారం ప్రత్యేక సమావేశానికి అధికార పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. సమావేశాన్ని, కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికను వాయిదా వేసినట్లు చైర్‌పర్సన్‌ రత్నకుమారి ప్రకటించారు. టీడీపీ కౌన్సిలర్‌ సూరపనేని చిన్ని మాట్లాడుతూ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక వాయిదా వేసే అధికారం చైర్‌పర్సన్‌, కమిషనర్లకు లేదన్నారు. బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ సమావేశాలను వాయిదాలు వేస్తూ కౌన్సిల్‌ సభ్యులను కించపరుస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ కేటీ.సుదాకర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రెండో సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేయడం జరిగిందన్నారు.

Updated Date - 2021-07-25T04:55:17+05:30 IST