అసాంఘిక కార్యకలాపాలు నియంత్రించాలి

ABN , First Publish Date - 2021-01-20T05:50:43+05:30 IST

పండుగ, ఇతర సెలవు దినాల్లో ప్రభుత్వ పాఠశాల ల్లోకి ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డకుండా నియంత్రణ చర్య లు చేపట్టాలని డీఈవో సీవీ రేణుక ఆదేశించారు.

అసాంఘిక కార్యకలాపాలు నియంత్రించాలి

 డీఈవో సీవీ రేణుక

పెదపాడు, జనవరి 19 : పండుగ, ఇతర సెలవు దినాల్లో ప్రభుత్వ పాఠశాల ల్లోకి ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డకుండా నియంత్రణ చర్య లు చేపట్టాలని డీఈవో సీవీ రేణుక ఆదేశించారు. కొక్కిరపాడు ప్రైమరీ పాఠ శాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు, చెత్త ఉండడాన్ని గమనించి నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం వేంపాడు ప్రైమరీ పాఠశాలను సందర్శించి నాడు–నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో సబ్బితి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T05:50:43+05:30 IST