కేజీబీవీల్లో ఉపాధ్యాయ నియామకాలకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-10-29T04:54:30+05:30 IST

సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో కు క్కునూరు, వేలేరు, వేలేరుపాడుల్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లలో 2021–22 ఏడాదికి ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్‌ఎస్‌ఏ అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌, డీఈవో సీవీ రేణుక తెలిపారు.

కేజీబీవీల్లో ఉపాధ్యాయ నియామకాలకు దరఖాస్తులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 28 :సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో కు క్కునూరు, వేలేరు, వేలేరుపాడుల్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లలో 2021–22 ఏడాదికి ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్‌ఎస్‌ఏ అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌, డీఈవో సీవీ రేణుక తెలిపారు. పీజీటీ విభాగంలో కెమిస్ట్రీ, సీఆర్‌టీ విభాగంలో హిందీ, గణితం సబ్జెక్టు టీచర్ల నియామకాలు జరుగు తాయన్నారు. అర్హత కలిగిన రిటైర్డ్‌ టీచర్లు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. వివరాలకు ఎస్‌ఎస్‌ఏ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని, దరఖాస్తులను ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

Updated Date - 2021-10-29T04:54:30+05:30 IST