కార్తీకం.. ఆరంభం

ABN , First Publish Date - 2021-11-06T05:07:21+05:30 IST

కార్తీక మాసోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

కార్తీకం.. ఆరంభం
క్షీరారాముడికి అభిషేకం చేస్తున్న అర్చకులు

నరసాపురం టౌన్‌/ మొగల్తూరు/యలమంచిలి/పెనుమంట్ర/ ఆకివీడు , నవంబరు 5: కార్తీక మాసోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భక్తులు వశిష్ఠ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేం దుకు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. గట్టుపై పూజలు చేసి దీపాలను గోదావరిలో విడిచిపెట్టారు. వలంధర్‌రేవులోని పరమశివుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఇటు పట్టణ, మండలంలోని శైవక్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కనిపించింది. చాలా మంది తొలి రోజున అభిషేకాలు చేయించుకున్నారు. పట్టణంలోని అమరేశ్వరస్వామి, జగన్నాఽథ స్వామి,లక్ష్మణేశ్వరం, ఎల్‌బీ చర్ల గ్రామాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి కనిపించింది. మొగ ల్తూరులోని పార్వతీ విశ్వేశ్వరస్వామి, కాళీపట్నం కాళికేశ్వరస్వామి, ముత్యాపల్లి భువనేశ్వరీ సమేత ముక్తేశ్వ రస్వామి, వడయార్‌పేట మల్లికార్జునస్వామి, పేరుపాలెం, కొత్తపాలెం గ్రామాల్లో చంద్రమౌళీశ్వ రస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెనుమంట్ర మండలం జుత్తిగ  ఉమావాసుకీ రవి సోమేశ్వర స్వామి, నత్తారామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు చేసి భక్తులకు దర్శనాలు కల్పించారు.


సోమేశ్వరుడికి అభిషేకాలు.. 


భీమవరంటౌన్‌,నవంబరు 5 : పంచారామ క్షేత్రమైన గునుపూడిలోని సోమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శ నం కల్పించారు. మొదటిరోజు స్వామివారిని దర్శించుకున్నవారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.భక్తులకు  ఇబ్బందులు కలగకుండా ఇవో అరుణ్‌కుమార్‌ పర్యవేక్షించారు.


క్షీరారాముడి దర్శనానికి క్యూ..


పాలకొల్లు అర్బన్‌, నవంబరు 5 : కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా శుక్రవారం వేకువ జాము నుంచే భక్తులు పాలకొల్లు పంచారామక్షేత్రంలో క్షీరా రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈవో యాళ్ల సూర్య నారాయణ, ఆలయ చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, ట్రస్టీలు ఏర్పాట్లను పర్యవే క్షించారు. సుమారు మూడు వేల మంది వరకు దర్శించుకున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. 


ఆచంటేశ్వరుడికి ప్రత్యేక పూజలు


ఆచంట,నవంబరు 5 : కార్తీక మాసం ప్రారంభం కావడంతో తొలి రోజు శుక్రవారం వేకువజామునే అనేక మంది మహిళలు స్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆచంట శ్రీ రామేశ్వరస్వామి ఆలయం వేకువజాము నుంచి భక్తులతో పోటెత్తింది. భక్తులకు ఆలయ చైర్మన్‌ నెక్కంటి రామలింగేశ్వరరావు, ఈవో గుబ్బల రామ పెద్దింట్లరావు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. 

Updated Date - 2021-11-06T05:07:21+05:30 IST