కాపుల సంక్షేమానికి నిధి ఏర్పాటు

ABN , First Publish Date - 2021-07-12T05:46:21+05:30 IST

కాపుల సంక్షేమం కోసం కాపు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి మూలధనం సమకూర్చాలని కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం తీర్మానించింది.

కాపుల సంక్షేమానికి నిధి ఏర్పాటు
భీమవరంలో కాపు సంక్షేమ సేన సమావేశంలో పాల్గొన్న సభ్యులు

భీమవరంలో కాపు సంక్షేమ సేన సమావేశం

భీమవరం, జూలై 11 :  కాపుల సంక్షేమం కోసం కాపు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి  మూలధనం సమకూర్చాలని కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం తీర్మానించింది. భీమవరంలో సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య అధ్యక్షతన ఆదివారం కాపు సమావేశం జరిగింది. కాపుల సాధికారతకు ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేయాలని పలు కీలక తీర్మానాలను చేశారు. కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ యిర్రింకి సూర్యారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినీడి తిరుమలరావు (బాబి), జనరల్‌ సెక్రటరీ గంధం లక్ష్మీసత్యశేఖర్‌, వెల్ఫేర్‌ కమిటీ అధ్యక్షుడు ఆకుల రమణమూర్తి, సోషల్‌ మీడియా చైర్మన్‌ మంగెన శ్రీనివాస్‌, ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ బూరగడ్డ శ్రీనాథ్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు తుమ్మల పద్మజాలక్ష్మి, కో కన్వీనర్‌ బోణం వెంకట నరసయ్య పాల్గొన్నారు. మత్స్యపురి వాసులు సొంతంగా ఏర్పాటు చేసు కున్న అంబులెన్స్‌కు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ అందజేశారు. 


Updated Date - 2021-07-12T05:46:21+05:30 IST