కాపుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి

ABN , First Publish Date - 2021-08-10T05:38:16+05:30 IST

కాపుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని కాపు నాయ కులు డిమాండ్‌ చేశారు. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.

కాపుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి

భీమవరం టౌన్‌/ఆచంట, ఆగస్టు 9 : కాపుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని కాపు నాయ కులు డిమాండ్‌ చేశారు. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కాపు సంక్షేమ ఫలాలు పక్కదారి పడుతున్నాయని, కాపులకు రావల్సిన వనరులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనతరం తహసీల్దార్‌ రమణారావుకు వినతి పత్రం అందించారు. నాయకులు ఇర్రింకి సూర్యారావు, మల్లినీడి తిరుమలరావు, గుండా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఆచంటలో..

రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆచంట నియోజకవర్గ కాపు సంక్షేమ సేన కన్వీనర్‌ బొలిశెట్టి రాంబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన బహిరంగ లేఖను సోమవారం తహశీల్దార్‌ కార్యాలయ ఆర్‌ఐకు అందజేశారు. తొలుత కొంతసేపు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నాయకులు బొలిశెట్టి రాంబాబు, నక్కా సత్యనారాయణ,గణేశుల సత్తిబాబు చల్లా శ్రీను, ఉంగరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-10T05:38:16+05:30 IST