దేవరపల్లిలో ‘కనకదుర్గ గోల్డ్ లోన్స్’ ప్రారంభం
ABN , First Publish Date - 2021-07-06T05:25:11+05:30 IST
ఫైనాన్స్ రంగంలో 40 ఏళ్లుగా విశిష్ఠ సేవలందిస్తున్న కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ వారి కనకదుర్గ గోల్డ్ లోన్స్ జిల్లాలో తమ 5వ శాఖను దేవరపల్లిలో సోమవారం ప్రారంభించారు.
దేవరపల్లి, జూలై 5: ఫైనాన్స్ రంగంలో 40 ఏళ్లుగా విశిష్ఠ సేవలందిస్తున్న కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ వారి కనకదుర్గ గోల్డ్ లోన్స్ జిల్లాలో తమ 5వ శాఖను దేవరపల్లిలో సోమవారం ప్రారంభించారు. ప్రజల వ్యాపార, వ్యక్తిగత అవసరాలకు ఎంతగానో ఈ సంస్థ దోహదపడుతుందని ఏరియా మేనేజర్ పెంకి హేమం త్ కుమార్ పేర్కొన్నారు. బ్రాంచి మేనేజర్ సీహెచ్ ఆంజనేయులు, అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ కె.శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.