ముగిసిన జేఈఈ మెయిన్స్
ABN , First Publish Date - 2021-09-03T06:10:33+05:30 IST
జేఈఈ మెయిన్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.

ఏలూరు ఎడ్యుకేషన్/భీమవరం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 2 : జేఈఈ మెయిన్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఏలూరు శ్రీ విద్య జూనియర్ కళాశాలలో 180 మంది విద్యార్థులకు 70 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 78 మందికి 40 మంది హాజరయ్యారని పరీక్షల ప్రాంతీయ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. భీమవరంలోని రెండు పరీక్షా కేంద్రాలలో రెండు సెక్షన్‌లుగా పరీక్ష నిర్వహించగా ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో 160 మంది విద్యార్ధులకు గాను 68 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 156 మందికి 58 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలతో పరీక్ష నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.