బయో ప్రొడక్ట్స్‌నే విక్రయించాలి
ABN , First Publish Date - 2021-02-02T05:03:53+05:30 IST
రాష్ట్ర ప్రభు త్వం ద్వారా అనుమతి పొందిన బయో ప్రొడక్ట్స్‌ను పురుగు మందుల దుకాణాదారులు విక్రయించాలని అనుమతి లేనివి విక్రయిస్తే చర్యలు తప్పవని జేడీఏ గౌసియా బేగం హెచ్చరించారు.

జేడీఏ గౌసియా బేగం
తాడేపల్లిగూడెం రూరల్, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభు త్వం ద్వారా అనుమతి పొందిన బయో ప్రొడక్ట్స్‌ను పురుగు మందుల దుకాణాదారులు విక్రయించాలని అనుమతి లేనివి విక్రయిస్తే చర్యలు తప్పవని జేడీఏ గౌసియా బేగం హెచ్చరించారు. కృష్ణాయపాలెంలో పురుగు మందుల దుకాణాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపు ముందు ఫ్లెక్సీలో ప్రభుత్వ అనుమతి ఉన్న బయోప్రొడక్టులను వివరించే ఏర్పాటు చేయాలని డీడీ వరలక్ష్మి సూచించారు. ఈ సందర్బంగా ఏడీఏ పి.మురళీకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సామూహిక ఎలుకల నివారణ మందును రైతులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏవో ఆర్‌ఎస్ ప్రసాద్, గ్రామ వ్యవసాయ సహాయకులు రామాంజనేయులు, జె.సతీశ్ తదితరులు పాల్గొన్నారు.