రైతులను ఆదుకుంటాం : జేడీఏ జగ్గారావు

ABN , First Publish Date - 2021-11-22T05:28:43+05:30 IST

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జగ్గారావు తెలిపారు.

రైతులను ఆదుకుంటాం : జేడీఏ జగ్గారావు

ఇరగవరం/ఉండ్రాజవరం, నవంబరు 21:వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జగ్గారావు తెలిపారు. కావలిపురం, ఇరగవరం, అర్జునుడుపాలెం, ఉండ్రాజవరం మండలంలో వడ్లూరు, సత్యవాడ, పసలపూడి గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం మండల వ్యవ సాయ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. జరిగిన నష్టంపై ప్రభు త్వానికి నివేదిక ఇచ్చి ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఉండ్రాజవరం ఏఈ మేరీకిరణ్‌ మాట్లాడుతూ మండలంలో ఇంతవరకు ప్రాఽథమికంగా సుమారు 1800 ఎకరాలు పంటనష్టం జరిగినట్ల వివరించారు.  ఏవో సీహెచ్‌ శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారి యు.సురేష్‌, వడ్లూరు సొసైటీ చైర్మన్‌ కఠారి సిద్ధార్థ, ఏఈవో మాసరమ్మ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-22T05:28:43+05:30 IST