జేసీ వెంకట రమణారెడ్డి విశాఖకు బదిలీ
ABN , First Publish Date - 2021-07-24T06:08:00+05:30 IST
జిల్లా జాయింట్ కలె క్టర్ కె.వెంకటరమణారెడ్డి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) కమిషన ర్గా బదిలీ అయ్యారు.

నూతన జేసీగా సుమిత్‌కుమార్
ఏలూరు, జూలై 23(ఆంధ్రజ్యోతి):జిల్లా జాయింట్ కలె క్టర్ కె.వెంకటరమణారెడ్డి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) కమిషన ర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గతంలో నరసా పురం సబ్ కలెక్టరుగా పనిచేసి జేసీగా పదోన్నతిపై శ్రీకాకు ళం వెళ్లిన సుమిత్‌కుమార్‌గాంధీ నియమితులయ్యారు. 2020 జనవరి 5న విజయనగరం నుంచి జిల్లాకు జేసీగా వచ్చిన వెంకటరమణారెడ్డి పనిచేసిన 18 నెలల కాలంలో విశేష సేవలందించారు. పలు అంశాల్లో, అభివృద్ధి కార్యక్ర మాల్లో తనదైన పాత్ర పోషించారు. కొవిడ్ ఫస్ట్ వేవ్ సం దర్భంగా విధించిన లాక్డౌన్లో వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించి వారిని ఆదుకోవడంలో విశేష కృషి చేశారు. భూముల రీ సర్వే పైలట్ ప్రాజెక్టును జిల్లాకు తీసుకురావ డంలోనూ కీలకంగా వ్యవహరించారు.
