జనసేనను బలోపేతం చేస్తాం
ABN , First Publish Date - 2021-07-25T05:20:50+05:30 IST
జిల్లాలో జనసేన పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు గోవిందరావు తెలి పారు.

తాడేపల్లిగూడెం, జూలై 24 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో జనసేన పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు గోవిందరావు తెలి పారు. తాడేపల్లిగూడెంలో శనివారం జిల్లా లోని 15 నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ సీనియర్ నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలో ని అందరి సూచనలు, సలహాలు తీసుకుని జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా గోవింద రావు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. తొలుత నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి న గోవిందరావును జనసేన ఇన్‌చార్జి బొలి శెట్టి, నాయకులు సత్కరించారు. సమా వేశంలో జనసేన సీనియర్ నాయకులు కనకరాజు సూరి, ఇర్రింకి సూర్యారావు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు జి.వెంకలక్ష్మి, సీహెచ్ సూర్యప్రకాశ్, ప్రియ సౌజన్య, కె.శ్రీనివాస్, రెడ్డి అప్పలనాయుడు, రామచంద్రరావు, మేకా ఈశ్వరయ్య పాల్గొన్నారు.