మహిళకు జనసేన సాయం

ABN , First Publish Date - 2021-12-26T05:46:30+05:30 IST

ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.. ఈ నానుడి ఈ రెండు సంఘటనలకు అతికి నట్టు సరిపోతోంది.

మహిళకు జనసేన సాయం
సాయం అందజేస్తున్న కొటికలపూడి గోవిందరావు

భీమవరం, డిసెంబరు 25 : ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.. ఈ నానుడి ఈ రెండు సంఘటనలకు అతికి నట్టు సరిపోతోంది. పట్టణానికి చెందిన కొండపల్లి కోటమ్మ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతోంది.సమాచారం అందు కున్న జనసేన సింగపూర్‌ టీం తరపున వచ్చిన రూ.1,13,400 జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు(చినబాబు) మహిళ కుమారుడు సిద్దార్ధ్‌కు అందజేశారు.అనంతరం గోవిందరావు మాట్లాడుతూ కష్టంలో ఉన్నవారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల చంద్రశేఖర్‌, మాజీ కౌన్సిలర్‌ వానపల్లి సూరిబాబు, నాయకులు అతికాల ఆంజనేయప్రసాద్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T05:46:30+05:30 IST