కాలనీల్లో పనులపై రోజూ నివేదిక ఇవ్వండి : ఆర్‌డీవో

ABN , First Publish Date - 2021-06-23T05:10:10+05:30 IST

ప్రతి రోజు అధికారులు కాలనీల్లో పనులు పర్యవేక్షించి సాయ ంత్రానికి నివేదిక అందించా లని ఆర్డీవో పద్మావతి ఆదే శించారు.

కాలనీల్లో పనులపై రోజూ నివేదిక ఇవ్వండి : ఆర్‌డీవో
నరసాపురంలో జగనన్న కాలనీల్లో పనులపై సమీక్షిస్తున్న ఆర్‌డీవో పద్మావతి

నరసాపురం/ మొగ ల్తూరు, జూన్‌ 22 : ప్రతి రోజు అధికారులు కాలనీల్లో పనులు పర్యవేక్షించి సాయ ంత్రానికి నివేదిక అందించా లని ఆర్డీవో పద్మావతి ఆదే శించారు. సబ్‌కలెక్టర్‌ కార్యా లయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పేదల స్థలాల్లో మౌలిక వసతులు పూర్తి చేయాలన్నారు. అనంతరం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి పంచాయతీ గెదళ్ళవంపు  లేఅవుట్‌లో పైప్‌లైన్‌, మొగ ల్తూరు పంచాయతీ కుక్కలవారితోటలోని లేఅవుట్లను పరిశీలించారు. కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావా లన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయితే మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యా లయ ఏవో పోతన్న, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు గిరి, వెంకట్రావు, నందారవు, విద్యుత్‌ అధికారులు ఖాన్‌, గోపాలచౌదరి, మధుకుమార్‌, మొగల్తూరు తహసీ ల్దార్‌ ఎస్‌కె హుస్సేన్‌, జేఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:10:10+05:30 IST