ఐటీడీఏ కేసులో.. ఆరుగురి అరెస్ట్‌ !

ABN , First Publish Date - 2021-06-23T05:28:04+05:30 IST

లైంగిక వేధింపుల కేసులో మంగళవారం బుట్టా యగూడెం పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమా చారం.

ఐటీడీఏ కేసులో.. ఆరుగురి అరెస్ట్‌ !

బుట్టాయగూడెం, జూన్‌ 22 : లైంగిక వేధింపుల కేసులో మంగళవారం బుట్టా యగూడెం పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమా చారం. కేఆర్‌ పురం ఐటీడీఏలో పనిచేసిన గత పీవో ఆర్‌వీ సూర్యనారాయణ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ గిరిజన యువతి ఈ నెల 12న సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో పీవోతో పాటు కుర్ల రమణారెడ్డి, తాతి శ్రీనివాసరావు, వర్మ, ముత్యాల నరేష్‌, పార్ధసారధి, రమణలపై బుట్టాయగూడెం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆరో పణలు ఎదుర్కొంటున్న వారందరిని స్టేషన్‌కు పిలిచి పోలీసులు విచారించారు. అనంతరం ఆరుగురిని అరెస్టు చేసి బుధవారం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరోవైపు మాజీ పీవో సూర్య నారాయణ పరారీలో వున్నట్టు సమాచారం. Updated Date - 2021-06-23T05:28:04+05:30 IST