సిగ్నల్‌ వ్యవస్థపై పరిశోధనలకు పెద్దపీట

ABN , First Publish Date - 2021-10-25T05:33:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో వైర్‌లెస్‌ సిగ్నల్‌ వ్యవస్థపై పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నట్టు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు.

సిగ్నల్‌ వ్యవస్థపై పరిశోధనలకు పెద్దపీట

 నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు

 తాడేపల్లిగూడెం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో వైర్‌లెస్‌ సిగ్నల్‌ వ్యవస్థపై పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నట్టు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసీటీఈ) సహకారంతో  ఏపీ నిట్‌ పరి శోధక బృందానికి సిగ్నల్‌ వ్యవస్థపై శిక్షణ ఇచ్చారు. రాడార్‌ వ్యవస్థ, కమ్యూ నికేషన్‌, స్మార్ట్‌ యాంటెన్నాలు తదితర అంశాలపై శిక్షణలో అవగాహన కల్పించారు. ఎలక్ర్టికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం కార్య క్రమాన్ని నిర్వహించింది. పరిశోధనా రంగంలో ఏపీ నిట్‌ మరింత ముందుకు సాగనుందని  డాక్టర్‌  సూర్యప్రకాశ్‌ రావు తెలిపారు. ఈసీఈ విభాగాధిపతి డాక్టర్‌ జి.కిరణ్‌కుమార్‌, వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.కిశోర్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ శర్మ, ప్రొఫెసర్‌ చంద్రమూర్తి, డాక్టర్‌ ఎ.అనిల్‌ కుమార్‌, డాక్టర్‌ తపస్‌ చక్రవర్తి తదితరులు మాట్లాడారు.  

Updated Date - 2021-10-25T05:33:05+05:30 IST