ఆలస్యంగా ఇంటర్‌ అర్ధ సంవత్సర పరీక్షలు

ABN , First Publish Date - 2021-12-31T05:14:47+05:30 IST

ఇంటర్‌ అర్ధ సంవత్సర పరీక్షలు గురు వారం ఆలస్యమయ్యాయి.

ఆలస్యంగా ఇంటర్‌ అర్ధ సంవత్సర పరీక్షలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 30 :ఇంటర్‌ అర్ధ సంవత్సర పరీక్షలు గురు వారం ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది అర్ధ సంవత్సరం పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే ప్రశ్నాపత్రంతో నిర్వహిస్తుండగా, ఆ మేరకు పరీక్ష సమయానికి ముందు ఇ–మెయిల్‌ ద్వారా ప్రశ్నాపత్రాన్ని పంపిస్తున్నారు. వీటిని కళాశాల ప్రిన్సిపాల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ అవుట్‌లు తీసి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం జరగాల్సిన ద్వితీయ సంవత్సరం గణితం, జువాలజీ, హిస్టరీ ప్రశ్నాపత్రాలను అరగంట ఆలస్యంగా ఇ–మెయిల్‌ ద్వారా కళాశా లలకు పంపించారు. వీటిని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రింట్‌అవుట్‌లు తీసి పరీక్ష ప్రారంభించేసరికి మధ్యాహ్నం రెండున్నర అయింది. దీనిపై ఇంట ర్మీడియట్‌ విద్యా మండలి జిల్లావర్గాలు వివరణ ఇస్తూ ప్రశ్నాపత్రాలను అరగంట ఆలస్యంగా పంపడం వల్ల పరీక్ష సమయాన్ని అరగంట పొడిగించినట్టు వివరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నాయి. 

Updated Date - 2021-12-31T05:14:47+05:30 IST