కరోనా దూకుడు

ABN , First Publish Date - 2021-05-21T05:14:17+05:30 IST

నిడదవోలు పట్టణ, మండలంలో మొత్తం 53 కేసు లు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు.

కరోనా దూకుడు

రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా పాజిటివ్‌ కేసులు 

నిడదవోలు, మే 20 : నిడదవోలు పట్టణ, మండలంలో మొత్తం 53 కేసు లు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు. పట్టణంలో గురువారం 24 కేసులు నమోదు కాగా మండలంలోని డి.ముప్పవరం 3, గోపవరం 2, కాటకూటేశ్వరం 2, కోరుమామిడి 1, పందలపర్రు 4, పురుషో త్తపల్లి 1, రావిమెట్ల 9, సమిశ్రగూడెం 2, తాళ్ళపాలెం 2, తిమ్మరాజుపాలెం 1, విజ్జేశ్వ రం 2, మొత్తం 29 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్‌డీఎల్‌ పరీక్షలు 34, ఆర్‌డీ పరీక్షలు 24 మొత్తం 58 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామన్నారు.

పెంటపాడులో 47 మందికి..

పెంటపాడు, మే, 20 : మండలంలో పెంటపాడు, ముదునూరు పీహెచ్‌సీల పరిధిలో గురువారం 47 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అలంపురం 7, ఆకుతీగపాడు 6, బి.కొండేపాడు 5, మీనవల్లూరు 5, ప్రత్తిపాడు 5, కోరుమిల్లి 4, పెంటపాడు 2, దర్శిపర్రు 2, ముదునూరు 3, రావిపాడు 2, కె.పెంటపాడు 2, పరిమెళ్ళ 2, మౌంజీపాడు 2 కేసులు నమోదయ్యాయన్నారు.

తణుకులో 45 మందికి..

తణుకు, మే 20 : తణుకు అర్బన్‌ ప్రాంతంలో 45 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని నోడల్‌ అధికారి డాక్టర్‌ బి. దుర్గామహేశ్వరరావు అన్నారు. కరోనా పరీక్షలకు సంబంధించి కొమ్మాయి చెర్వుగట్టు, ఎన్‌జీవో కాలనీ, అర్బన్‌ సెంటర్‌లలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుదారులకు 167 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశామన్నారు. 

అత్తిలిలో 41 మందికి..

అత్తిలి, మే 20 : కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారిణి ప్రసన్నకుమారి తెలిపారు. మండలంలో 41 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. అత్తిలి పీహెచ్‌సీలో 17, మంచిలి పీహెచ్‌సీ పరిధిలో 24 పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు.

భీమడోలులో 37 మందికి..

భీమడోలు, మే 20 : మండలంలో గురువారం 37 మందికి కరోనా సోకిందని ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. భీమడోలు 20, గుండుగొలను 10, పూళ్ల 4, అంబర్‌పేట, కురెళ్లగూడెం, పోలసానపల్లిలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయన్నారు. 

తాడేపల్లిగూడెంలో 29 మందికి..

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 20 : మండలంలో గురువారం 29 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు క్వారంటైన్‌ సెంటర్‌కు, ఇద్దరు ఏరియా ఆసుపత్రికి, 23 మంది హోం క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో ఆరుగొలను 4, తాడేపల్లి 3, పడాల 4, ఎల్‌ అగ్రహారం 2, మోదుగగుంట 2, కొత్తూరు 2, కృష్ణాయపాలెం 2, మాధవరం 2, నవాబుపాలెం 3, అప్పారావుపేట, వీఆర్‌గూడెం, మెట్టఉప్పర గూడెం, రామన్నగూడెం, నందమూరుల్లో ఒక్కో కేసు నమోదయింది. 

ఇరగవరంలో 26 మందికి..

ఇరగవరం, మే 20 : ఇరగవరం, రేలంగి పీహెచ్‌సీ పరిధిలో  గురువారం 26 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యులు బంగారు రవి, వై.యశోద తెలిపారు. ఇరగవరం పీహెచ్‌సీ పరిధిలో 13, రేలంగి పీహెచ్‌సీ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయన్నారు. 37 వీఆర్‌డీఎల్‌ పరీక్షలు, ఆర్‌డీ పరీక్షలు 60 మందికి నిర్వహించామన్నారు. 

Updated Date - 2021-05-21T05:14:17+05:30 IST