కరోనా.. దూకుడు

ABN , First Publish Date - 2021-05-19T05:15:31+05:30 IST

నిడదవోలు పట్టణ, మండలంలోలో మంగళవారం ఒక్కరోజే 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు.

కరోనా.. దూకుడు

సెకండ్‌ వేవ్‌లో పెరుగుతోన్న కొవిడ్‌ కేసులు 

కరోనా దూకుడు పెరిగింది. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఓ వైపు కరోనా కట్టడికి అధికారు లు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కొంతమంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా స్వీయ నియంత్రణతోనే కరోనాను అంతమొందిద్దాం.. భౌతిక దూరం పాటిస్తూ పారదోలుదాం..

నిడదవోలు, మే 18 : నిడదవోలు పట్టణ, మండలంలోలో మంగళవారం ఒక్కరోజే 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు. పట్టణంలో 43 కేసులు నమోదు కాగా, మండలంలో గోపవరం 6, కోరుమామిడి 1, పెండ్యాల 3, పురుషోత్తపల్లి 1, శెట్టిపేట 7, తాడిమళ్ళ 1, తాళ్ళపాలెం 4 23 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. పట్టణ పరిధిలో వీఆర్‌డీఎల్‌ పరీక్షలు 22, ఆర్‌బీ6 పరీక్షలు 40 మొత్తం 62 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

అత్తిలిలో 50 మందికి..

అత్తిలి, మే 18 : మండలంలో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి ప్రసన్నకుమారి తెలిపారు. అత్తిలి పీహెచ్‌సీలో 28, మంచిలి పీహెచ్‌సీలో 22 కేసులు వచ్చాయన్నారు. ఆరవల్లి 2, బల్లిపాడు 1, గుమ్మంపాడు 3, కె.సముద్రపుగట్టు 2, కంచుమర్రు, కొమ్మర, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో ఒక్కొక్కటి, మంచిలిలో 6, పాలి 2, పాలూరు 3, తిరుపతిపురం4, ఉనికిలి 7, ఉరదాలపాలెం 1, అత్తిలిలో 16 కేసులు నమోదయ్యాయన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనాకు స్వీయరక్షణ చర్యలు పాటించాలని ఆమె కోరారు. 

తాడేపల్లిగూడెంలో 36 మందికి..

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 18 :మండలంలో 36 కరోనా కేసులు నమో దయ్యాయని తహసీల్దార్‌ బి.సాయిరాజ్‌ తెలిపారు. వీరిలో 24 మంది హోం ఐసొలేషన్‌లో, ఏడుగురు క్వారంటైన్‌ సెంటర్‌కు, ముగ్గురు ప్రైవేట్‌ ఆసుపత్రికి, ఒకరు ఏరియా ఆసుపత్రికి, మరొకరు జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. 

పెంటపాడులో 29 మందికి..

పెంటపాడు, మే, 18 : మండలంలో పెంటపాడు, ముదునూరు పీహెచ్‌సీ పరిధిలో మంగళవారం 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు. పెంటపాడు 6, ముదునూరు 4, వల్లూరుపల్లి 3, మీనవల్లూరు 3, ప్రత్తిపాడు 2, బి.కొండేపాడు 2, అలంపురం 2,  కే.పెంటపాడు 2, మౌంజీపాడు 2, రావిపాడు, దర్శిపర్రు, పరిమెళ్ల గ్రామాలలో ఒక్కో కేసు నమోదయ్యాయన్నారు.

ఉండ్రాజవరంలో 30 మందికి..

ఉండ్రాజవరం, మే 18 : మండలంలో మంగళవారం 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పీహెచ్‌సీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. చివటంలో 2, దమ్మెన్నులో 7, కె.సావరం 3, కాల్థరి 2, మోర్త 1, పాలంగి 1, పసలపూడి 1, సత్యవాడ 4, ఉండ్రాజవరం 9 కేసులు నమోదయ్యాయన్నారు. 

తణుకులో 26 మందికి..

తణుకు, మే 18 :తణుకు మునిసిపల్‌ పరిధిలో 26 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.దుర్గామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం కరోనా పరీక్షలకు సంబంధించి ఎన్‌జీవో కాలనీ, కొమ్మాయిచెర్వు గట్టు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు 180 మందికి పరీక్షలు చేసినట్టు చెప్పారు. 

పెరవలిలో 20 మందికి..

పెరవలి, మే 18 : కానూరు ఆరోగ్యకేంద్ర పరిధిలో 35 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. పెరవలి  ఆరోగ్యకేంద్ర పరిధిలో 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ సోకిందన్నారు. 

ఉంగుటూరులో 19 మందికి..

ఉంగుటూరు, మే 18 : మండలంలో మంగళవారం 19 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని కాగుపాడు, చేబ్రోలు పీహెచ్‌సీ వైద్యాధికారులు అనిల్‌ కుమార్‌, వర్మ  తెలిపారు. ఉంగుటూరులో 5, చేబ్రోలులో 4, యర్రమళ్ళలో 3, కాకర్లమూడిలో 2, రాచూరు, అక్కుపల్లిగోకవరం, నారాయణపురం, గోపాలపు రం, యర్రమిల్లిపాడులలో ఒక్కొక్క కేసు నిర్ధారణ అయ్యాయన్నారు.

భీమడోలులో 11 మందికి..

భీమడోలు, మే 18 : మండలంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయని ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. ఆగడాలలంక 2, అంబర్‌పేట 2, భీమడోలు 4, గుండుగొలను 3 కేసులు నమోదయ్యాయన్నారు. 

ఇరగవరంలో పది మందికి.. ఒకరి మృతి 

ఇరగవరం, మే 18 : ఇరగవరం, రేలంగి పీహెచ్‌సీ పరిధిలో మంగళవారం పది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యులు బంగారు రవి, వై.యశోద తెలిపారు. ఇరగవరం పీహెచ్‌సీ పరిధిలో 8, రేలంగి పీహెచ్‌సీ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. 43 వీఆర్‌డీఎల్‌ పరీక్షలు, ఆర్‌డీ పరీక్షలు 13 మందికి నిర్వహించామన్నారు. సూరంపూడిలో 45 ఏళ్ల వ్యక్తి కరోనా వ్యాధితో మరణించాడని వైద్యులు తెలిపారు.


Updated Date - 2021-05-19T05:15:31+05:30 IST