బంకుల్లో కల్తీపై ఫిర్యాదు చేయండి : శ్యామ్‌సుందర్
ABN , First Publish Date - 2021-10-22T05:14:58+05:30 IST
పెట్రోల్ బంకుల్లో కల్లీ జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని హెచ్‌పీసీఎల్ జిల్లా మేనేజర్ కె.శ్యామ్‌సుందర్ చెప్పారు.

నరసాపురం, అక్టోబరు 21: పెట్రోల్ బంకుల్లో కల్లీ జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని హెచ్‌పీసీఎల్ జిల్లా మేనేజర్ కె.శ్యామ్‌సుందర్ చెప్పారు. పాలకొల్లు రోడ్‌లో గణేష్‌సాయి పెట్రోల్ బంక్‌ను గురువారం తనిఖీ చేశారు. స్వయంగా వాహనానికి పెట్రోల్ కొట్టి రీడింగ్ చెక్ చేశారు. అనంతరం మాట్లాడుతూ పాలకొల్లు, భీమవరం ఏఎంసీలతో కలిసి రెండు చోట్ల పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో హెచ్‌పీసీ ఎల్‌కు 91 బంకులు ఉన్నాయన్నారు. ఏడాది చివరికి ఈ సంఖ్య 100కు చేరుతు ందన్నారు.కార్య క్రమంలో డీలర్లు కోట్ల రాజా, డి.సురేష్, చక్రవర్తి, చందు, షిర్డీ పాల్గొన్నారు.