‘నెలాఖరుకు ఇళ్ల పట్టాలు పంపిణీ పూర్తి చేయాలి’

ABN , First Publish Date - 2021-01-13T05:36:39+05:30 IST

ఏలూరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈనెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

‘నెలాఖరుకు ఇళ్ల పట్టాలు పంపిణీ పూర్తి చేయాలి’

ఏలూరు రూరల్‌, జనవరి 12 : ఏలూరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈనెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను  ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాట్లపై మంగళ వారం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో ఆయ న సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈనెల 18న నియోజకవర్గ పరిధిలో కొమడవోలులో, 24న చొదిమెళ్లలో పట్టాలు అందజేస్తామన్నారు. సమావేశంలో జేసీ తేజ్‌భరత్‌, డ్వామా పీడీ రాంబాబు, ఏలూరు ఇన్‌చార్జి ఆర్డీవో ఉదయభాస్కర్‌, తహసీల్దార్‌ సోమశేఖర్‌, ఎంపీడీవో రాజ్‌మనోజ్‌, ఏఎంసీ చైౖర్మన్‌ మంచెం మైబాబు, బండారు కిరణ్‌కుమార్‌, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరంగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:36:39+05:30 IST