మూడేళ్లగా అభివృద్ధి కాని ప్రభుత్వాసుపత్రి : నిమ్మల

ABN , First Publish Date - 2021-12-31T05:18:19+05:30 IST

మూడేళ్లుగా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు.

మూడేళ్లగా అభివృద్ధి కాని ప్రభుత్వాసుపత్రి : నిమ్మల

పాలకొల్లు, డిసెంబరు 30 : మూడేళ్లుగా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు.ప్రభుత్వాసుపత్రిని గురువారం రాత్రి సంద ర్శించి ఆసుపత్రిలో వైద్యులతో సమీక్షించారు. టీడీపీ హయాంలో ప్రభుత్వాసు పత్రికి 50 పడకల నుంచి 100 పడకలకు అనుమతి తెచ్చి రూ.12.80 లక్షలు నిధులు మంజూరు చేయిస్తే నేటికీ పూర్తిచేయలేదన్నారు. టెండర్లు పిలిచిన ఏడాది సమయంలో పనులు పూర్తి కావాల్సి ఉండగా మూడేళ్లగా పనులు పునాదులు దాటలేదన్నారు.ఆసుపత్రిలో గైనకాలజిస్టు పోస్టు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గీతా కుమారి, నర్సింగ్‌ సూప రింటెండెంట్‌  సీహెచ్‌ విజయ కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T05:18:19+05:30 IST