ఆసుపత్రిలో వైద్యులను నియమిస్తాం

ABN , First Publish Date - 2021-11-06T04:51:05+05:30 IST

చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేరని, నియమకానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా హామీ ఇచ్చారు.

ఆసుపత్రిలో వైద్యులను నియమిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

చింతలపూడి, నవంబరు 5: చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేరని, నియమకానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆసుపత్రిలో 30 బెడ్లు సౌకర్యం ఉందని, ఆరుగురు డాక్టర్లకు ఇద్దరే ఉన్నారని, మందుల బడ్జెట్‌ కూడా రావడం లేదని, రాత్రి వేళ మందుబాబులు గొడవ చేస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువెళ్లి డాక్టర్ల కొరత తీరుస్తామని, బడ్జెట్‌ ఎందుకు తగ్గిస్తున్నారో తెలుసుకుంటామని చెప్పారు. రాత్రివేళ ఇబ్బంది అయితే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రసూల్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T04:51:05+05:30 IST