జాతీయస్థాయి హాకీ పోటీల్లో విజేతగా నిలవాలి : జేసీ

ABN , First Publish Date - 2021-10-20T05:01:21+05:30 IST

జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళల జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో హాకీ శిక్షణా శిబిరం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మంగళవారం ముగిసింది.

జాతీయస్థాయి హాకీ పోటీల్లో విజేతగా నిలవాలి : జేసీ
జేసీ హిమాన్షుశుక్లాను కలిసిన హాకీ క్రీడాకారిణులు

ఏలూరు స్పోర్ట్స్‌, అక్టోబరు 19: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళల జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో హాకీ శిక్షణా శిబిరం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మంగళవారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న హాకీ క్రీడాకారిణీలు జేసీ హిమాన్షుశుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయి హాకీ పోటీల్లో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈనెల 20వ తేదీ నుంచి 26 వరకూ మహిళల సీనియర్‌ పోటీలు ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో, జూనియర్స్‌ పోటీలు జార్ఘండ్‌లో జరుగనున్నాయి. దీపక్‌ ఆకాష్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. సీనియర్‌ విభాగానికి సురేష్‌ వ్యవహరిస్తున్నారని డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ అజీజ్‌ తెలిపారు. 


Updated Date - 2021-10-20T05:01:21+05:30 IST