జోరు వాన
ABN , First Publish Date - 2021-09-04T05:15:11+05:30 IST
పలుచోట్ల శుక్రవారం కురిసిన భారీ వర్షం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

టి.నరసాపురం / కొవ్వూరు: పలుచోట్ల శుక్రవారం కురిసిన భారీ వర్షం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. టి.నరసాపురం యూనియన్ బ్యాంక్ వద్ద రోడ్డుపై వర్షపు నీరుతో రాకపోకలకు ఆటంకం కలిగింది.
కొవ్వూరు పట్టణంలో సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
