150 మందికి ఉచిత గుండె వైద్య పరీక్షలు
ABN , First Publish Date - 2021-01-18T05:39:08+05:30 IST
జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 150 మందికి ఉచితంగా గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు.
కామవరపుకోట, జనవరి 17 : జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 150 మందికి ఉచితంగా గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ హైస్కూలు వద్ద విజయవాడ గుండె వైద్య నిపుణుడు వైవీ రావు ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోగులకు సలహాలు, సూచనలు చేశారు. 25 మందికి ఆంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు యర్రంరాజు, మందలపు నరసింహారావు, మాధవ్ వర్మ, కామేశ్కుమార్, వెంకట రామరాజు, కాకర్ల మురళీ, రాజు, ఎస్ఆర్ఆర్ రమేష్, శర్మ, సత్యనారాయణరాజు, వీర రామకృష్ణంరాజు, టి.సుబ్బారావు, శేఖర్‌బాబు, రామకృష్ణ, మధుబాబు, వీరభద్ర రావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.