మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీకి అస్వస్థత

ABN , First Publish Date - 2021-05-02T05:53:47+05:30 IST

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణ మూర్తి (బాబ్జీ) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు.

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీకి  అస్వస్థత

పాలకొల్లు, మే 1 : పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణ మూర్తి (బాబ్జీ) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఆయనకె స్టెంట్‌ వేశారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం.  డాక్టర్‌ బాబ్జీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆయన అభిమానులు ఆలయాల్లో దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు.


Updated Date - 2021-05-02T05:53:47+05:30 IST