గుబ్బల మంగమ్మకు లక్ష కుంకుమార్చన

ABN , First Publish Date - 2021-02-27T04:48:07+05:30 IST

గుబ్బల మంగమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి లక్ష కుంకు మార్చన పూజలు మహి ళా భక్తులు ఘనంగా ని ర్వహించారు.

గుబ్బల మంగమ్మకు లక్ష కుంకుమార్చన
ఆలయం వద్ద ఐటీడీఏ పీవో దంపతులు, భక్తులు

బుట్టాయగూడెం, ఫి బ్రవరి 26 : గుబ్బల మంగమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి లక్ష కుంకు మార్చన పూజలు మహి ళా భక్తులు ఘనంగా ని ర్వహించారు. ముందుగా అమ్మవారిని కలశాభిషేకం, జలాభిషేకం పూజలతోపాటు హోమం నిర్వహిం చారు. ఎమ్మెల్యే బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో ఆర్‌వీ సూర్య నారాయణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఐటీడీఏ డీడీ వెంకటేశ్వరావు, అధికారులు అమ్మవా రిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు కోర్స గంగరాజు, కోర్స కన్నపరాజు, పెద్దిరెడ్డి మూర్తి, యు.ఏసుబాబు, బొల్లి విశ్వనాథరెడ్డి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Updated Date - 2021-02-27T04:48:07+05:30 IST