సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు : ఏఎస్పీ

ABN , First Publish Date - 2021-11-09T05:51:14+05:30 IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌) ఏవీ సుబ్బరాజు అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో  మెరుగైన సేవలు : ఏఎస్పీ

పెదవేగి, నవంబరు 8: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌) ఏవీ సుబ్బరాజు అన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురం, పోలవరం సబ్‌ డివిజన్‌ పరిధిలోని మొత్తం 25 మంది హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ స్థాయి సిబ్బందికి పెదవేగిలోని జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఈ కాప్‌ బేసిక్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడుతూ నేరాల అదుపులో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని మరింతగా పెంచడానికి అనువుగా ఆయా డివిజన్‌ పరిధిలో సిబ్బందికి మెరుగైన శిక్షణ అందిస్తున్నామని  తెలిపారు. డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకరరావు, సీఐ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:51:14+05:30 IST