బంగారు తల్లికి నీరాజనం..

ABN , First Publish Date - 2021-10-08T05:24:34+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమవరం ఆర్యవైశ్య సంఘ భవనంలోని వాసవీ మాతకు బంగారు చీరను అలంకరించారు.

బంగారు తల్లికి నీరాజనం..
బంగారు చీరలో వాసవీ మాత

రెండు కేజీల బంగారంతో వాసవీ మాతకు బంగారు చీర

భీమవరం టౌన్‌ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమవరం ఆర్యవైశ్య సంఘ భవనంలోని వాసవీ మాతకు బంగారు చీరను అలంకరించారు. గురువారం ఉరేగింపు నిర్వహించి ఎమ్మెల్యే గ్రంఽధి శ్రీనివాస్‌ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అమ్మ వారికి చీర అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఆర్య వైశ్య సంఘం, ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో రూ. కోటి విలువ చేసే సుమారు రెండు కేజీల బంగారంతో ఈ చీరను  తయారు చేయించారు. 

Updated Date - 2021-10-08T05:24:34+05:30 IST