గోదావరి మాతకు మహానీరాజనం

ABN , First Publish Date - 2021-02-27T04:46:30+05:30 IST

అఖండ గోదావరి మాతకు మ హానీరాజనం అందజేశారు.

గోదావరి మాతకు మహానీరాజనం
మహానీరాజనం అందిస్తున్న పండితులు

కొవ్వూరు, ఫిబ్రవరి 26 : అఖండ గోదావరి మాతకు మ హానీరాజనం అందజేశారు. కొ వ్వూరు గోదావరి నీరాజన సమి తి అధ్యక్షుడు కలిగొట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో మాఘపూర్ణిమను పురస్కరించుకుని శుక్రవారం ప్రదోషకాలంలో గోష్పాదక్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టం లో వున్న గోదావరి మాత విగ్ర హం వద్ద పూజలు నిర్వహించారు. గౌతముడు, గోవు, గోదారమ్మకు పూజలు చేశారు. అనంతరం గోదావరి మాతకు 184 మాసోత్సవ మహానీరాజనం అందజేశారు. మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. ఇనుగంటి ఉమారామారావు, తుట్టగుంట బైరవమూర్తి, పాలకోడేటి సత్యనారాయణమూర్తి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:46:30+05:30 IST